అభ్యర్థుల ప్రకటన... ఖమ్మం కార్పోరేషన్లో జనసేన దూకుడు

By Arun Kumar PFirst Published Apr 21, 2021, 7:18 PM IST
Highlights

బిజెపితో పొత్తులో భాగంగానే జనసేన ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలో మొత్తం ఆరు డివిజన్లలో పోటీ చేయనుంది. ఈ మేరకు ఖమ్మంలోని ఆరు డివిజన్లలో పోటీచేసే అభ్యర్థులను జనసేన ప్రకటించింది. 
 

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. బిజెపితో పొత్తులో భాగంగానే జనసేన ఆరు డివిజన్లలో పోటీ చేయనుంది. ఈ మేరకు ఖమ్మంలోని ఆరు డివిజన్లలో పోటీచేసే అభ్యర్థులను జనసేన ప్రకటించింది. 

జనసేన పార్టీకి 23, 48, 28, 16, 8, 52 డివిజన్లను కేటాయించింది బిజెపి. మొత్తం అరవై డివిజన్లున్న ఖమ్మం కార్పోరేషన్ లో జనసేన ఆరు డివిజన్లలో పోటీచేయగా మిగతా చోట్ల బిజెపి అభ్యర్థులు పోటీలో నిలవనున్నారు.  ఇరు పార్టీల శ్రేణులు పరస్పర సమన్వయంతో గెలుపు కోసం క్రుషి చేయాలని నిర్ణయించినట్లు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. జజసేనకు కేటాయించిన ఆరు డివిజన్లలో పోటీచేయనున్న అభ్యర్ధులను ప్రకటించారు హరిప్రసాద్.  

ఖమ్మం కార్పోరేషన్లో పోటీ చేయనున్న జనసేన అభ్యర్థులు వీరే:  

23వ డివిజన్‌ - మిరియాల జగన్ 

48 డివిజన్ - ధనిశెట్టి భానుమతి  

28వ డివిజన్ -  భోగా హరిప్రియ  

16డివిజన్ - బండారు రామక్రుష్ణ  

8వ డివిజన్ - బోడా వినోద్  

 51వ డివిజన్ - సింగారపు చంద్రమౌళి 

click me!