మంత్రులు, టిఆర్ఎస్ వాళ్లుంటే జైలుకు పంపురి

First Published Jul 16, 2017, 6:44 PM IST
Highlights
  • డ్రగ్స్ విషయంలో మరింత కఠినంగా ఉండాలన్న సిఎం కెసిఆర్
  • గత పాలకుల వైఫల్యం కారణంగానే డ్రగ్స్ అంతటా ఎగబాకింది
  • ఎవరినీ రక్షించాల్సిన అవసరం సర్కారుకు లేదు
  • అకున్ సబర్వాల్ సెలవు రద్దు చేసుకోవాలని నేనే చెప్పిన
  • హైదరాబాద్ పోలీసులకు, ఎక్సైజ్ సిబ్బందికి మంచి పేరు వచ్చింది.
  • ఇంకా కష్టపడి పనిచేయాలి.

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిన నేపథ్యంలో తెలంగాణ సిఎం కెసిఆర్ స్పందించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్వవహరించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ కేసులో టిఆర్ఎస్ నేతలున్నా, తుదకు మంత్రులున్నా వదలకుండా కేసులు పెట్టి జైలుకు పంపాలని ఆదేశాలిచ్చారు. కెసిఆర్. డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడా ముందుకు వెళ్లాలని, అన్ని కోణాల నుంచి లోతుగా దర్యాప్తు చేయాలన్నారు కెసిఆర్.

 

రాజకీయ నాయకులైనా, చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా కేసు పెట్టాలని ఆదేశించారు. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి. టిఆర్ఎస్ వారి పాత్ర ఉన్నా సరే, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపండి.  ప్రభుత్వానికి ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదు. అని సిఎం అధికారులకు హితబోధ చేశారు.

 

డ్రగ్స్, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

‘‘హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా, వాడకం ఎప్పటి నుంచో ఉంది. గత పాలకులు ఈ విషయంలో అశ్రద్ధ చూపారు. వారే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడీ దుర్మార్గం మనకు వారసత్వంగా వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరం. హైదరాబాదే తెలంగాణకు లైఫ్ లైన్. కాబట్టి హైదరాబాద్ లో అరాచకం అంతం కావాలి. కేసు పరిశోధనలో ఉన్న సమయంలో సెలవులో వెళ్లవద్దని నేనే అకున్ సభర్వాల్ కు సూచించాను.  హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటిగా మార్చాలి’’ అని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

 

మొత్తానికి సిఎం సూచనలతో అధికారులు ఏమేరకు దూకుడు ప్రదర్శిస్తారో చూడాలి. డ్రగ్స్ విషయంలోనూ సిఎం కెసిఆర్ గత పాలకులను మరోసారి నెమరేసుకున్నారు. సిఎం కెసిఆర్ ప్రకటనలపై గత పాలకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

click me!