ఏడడుగుల మంత్రి ఏం చేయలేదు, మా మూడడుగుల బుల్లెట్ నీళ్లు తెచ్చాడు: జగదీష్ రెడ్డిపై కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Oct 26, 2019, 6:23 PM IST
Highlights

నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని, జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా జగదీష్ రెడ్డి పర్యటించి సమస్యలను గుర్తించి తనతో చెప్పి పరిష్కరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

హుజూర్ నగర్: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల్లో గెలుపొందేందుకు అర్థంపర్థంలేని ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శానంపూడి సైదిరెడ్డి అసలు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని గుంటూరుకు చెందిన వ్యక్తి అంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. 

ఎన్నికల్లో ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. గెలుపుకోసం అనేక అవాక్కులుచెవాక్కులు పేలారని తిట్టిపోశారు. ప్రభుత్వంపై నీలాపనిందలు వేశారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. 

ఇకపోతే జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. మూడుఫీట్లు లేడంటూ విమర్శలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఏడుఫీట్ల మంత్రి నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. 

జగదీష్ రెడ్డి మూడు ఫీట్లే ఉన్నాడని తామేమి ఏడుఫీట్లు ఉన్నాడని, ఎనిమిది ఫీట్లు ఉన్నాడని చెప్పలేదన్నారు. మూడు ఫీట్లు ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి 300 కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చి నల్గొండ జిల్లాను పునీతం చేశాడని చెప్పుకొచ్చారు. 

నల్గొండ జిల్లాకు అనేక నిధులు తెచ్చుకున్నాడని చెప్పుకొచ్చారు. రూ.30వేల కోట్లతో యాదాద్రి అల్ట్రాపవర్ ప్లాంట్ తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే జిల్లాకు సాగునీరందించేందుకు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే నల్గొండ జిల్లా ముఖచిత్రాన్ని మార్చేందుకు జగదీష్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే నియోజకవర్గంతోపాటు నల్గొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు. 

ఇప్పటి వరకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టాడని అది పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై పెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ ఎడమకాల్వ ద్వారా నీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

ఇకపోతే తాను 1997లో దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కరువు మంత్రిగా పనిచేసినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆనాడు నియోజకవర్గంలో తాను ఏ సమస్యలను అయితే విన్నానో ఇప్పటికీ అవే సమస్యలు వింటున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇది హుజూర్ నగర్ దుస్థితి అని చెప్పుకొచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం నేర్చుకున్నారని విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. 

నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని, జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా జగదీష్ రెడ్డి పర్యటించి సమస్యలను గుర్తించి తనతో చెప్పి పరిష్కరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్ నగర్ కృతజ్ఞతసభ: సీఎం కేసీఆర్ వరాలజల్లు...

click me!