కేసీఆర్ వ్యుహం ఎంటో తెలుసు.. హుజురాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చింది ఆయనే: ఈటల రాజేందర్

Published : Jul 11, 2022, 01:47 PM IST
కేసీఆర్ వ్యుహం ఎంటో తెలుసు.. హుజురాబాద్‌లో  ఓటుకు నోటు ఇచ్చింది ఆయనే: ఈటల రాజేందర్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. సోమవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు కావాల్సింది బానిసలని.. కానీ తాము ఉద్యమకారులం అని చెప్పారు. ఉద్యమకారుడిగా ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బయటకు నెట్టారని.. తానుగా బయటకు వెళ్లలేదని చెప్పారు. 

కేసీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తన మీద ఏ రాజకీయ పార్టీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేసీఆర్‌ మాదిరిగా తాను సంస్కారం లేకుండా మాట్లాడనని అన్నారు. తన తల్లి తనకు సంస్కారం నేర్పారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, ప్రజలు.. సహనాన్ని, ఓపికను ఇచ్చారని అన్నారు. 

హుజురాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చింది కేసీఆర్‌ అని ఆరోపించారు. కేసీఆర్ బలం, బలహీనత, భయం తెలిసిన వ్యక్తిని తానని చెప్పారు. కేసీఆర్ వ్యుహం ఎంటో తనకు తెలుసని అన్నారు. దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. చరిత్ర నిర్మాతలు, ఎప్పుడూ నాయకులు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?