తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశం..

Published : Apr 23, 2023, 02:25 PM ISTUpdated : Apr 23, 2023, 02:30 PM IST
తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశం..

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే అకాల  వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని అన్నారు. 

ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లాలో పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగాళ్ల వానతో నష్టపోయిన పంటలను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పారు. 

 

 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం