తెలంగాణ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ సోమవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే వాస్తవిక బడ్జెట్ సైజు తగ్గింది.
హైదరాబాద్: 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రూ.1 లక్ష 46వేల 492 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టాింది తెలంగాణ సర్కార్.. ఈ ఏడాది వాస్తవ అంచనాలతో బడ్జెట్ ను ప్రవశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 1లక్షా82వేల017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.దేశంలో ఆర్ధిక మాంద్యం కారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే వాస్తవిక బడ్జెట్ ను తగ్గించారు.
undefined
రెవెన్యూ వ్యయం 1లక్ష 11వేల 055 కోట్లుగా ఉంటుందని అంచాన వేశారు. మూల ధన వ్యయం 17, 274.67 కోట్లుగా అంచాన వేసింది. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.