శామీర్‌పేట పీహెచ్‌సీ ఆవరణలో చెత్తా చెదారం: మంత్రి మల్లారెడ్డికి కేసీఆర్ ఫోన్

By narsimha lodeFirst Published May 28, 2020, 11:02 AM IST
Highlights

మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని  ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర ఆవరణలో చెత్తా చెదారంతో ఉండడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పీహెచ్ సీ స్థితి గతులపై సీఎం ఆరా తీశారు. ఈ విషయమై మంత్రి మల్లారెడ్డికి కేసీఆర్ బుధవారం నాడు ఫోన్ చేశారు.

హైదరాబాద్: మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని  ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర ఆవరణలో చెత్తా చెదారంతో ఉండడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పీహెచ్ సీ స్థితి గతులపై సీఎం ఆరా తీశారు. ఈ విషయమై మంత్రి మల్లారెడ్డికి కేసీఆర్ బుధవారం నాడు ఫోన్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హైద్రాబాద్ నుండి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కు వెళ్తున్న సమయంలో శామీఱ్ పేట పీహెచ్‌సీ ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ లో మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి ఈ విషయమై మాట్లాడారు.

ఈ పీహెఛ్‌సీకి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో పచ్చని చెట్లతో నిండిపోయింది. ఇది చూసిన కేసీఆర్ సంతృప్తి చెందారు. కానీ పక్కనే ఉన్న ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో ఆయన సంతోషంగా లేరు.

ముఖ్యమంత్రి ఫోన్ చేయడంతో మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం నాడు  ఆసుపత్రిని సందర్శించారు. పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించారు. మొక్కలు నాటి పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు. ఆసుపత్రిని అభివృద్ది చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిసరాలను పచ్చగా మార్చిన సీఐ నవీన్ రెడ్డి గురించి కూడ సీఎం ఆరా తీశారు.
 

click me!