కరోనా వ్యాక్సిన్: సోమవారం మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ భేటీ

Siva Kodati |  
Published : Jan 08, 2021, 07:24 PM IST
కరోనా వ్యాక్సిన్: సోమవారం మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ భేటీ

సారాంశం

11న మంత్రులు, కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు

11న మంత్రులు, కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు కరోనా వ్యాక్సిన్ పంపిణీపైన చర్చించనున్నారు. విద్యా సంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్.

కాగా, కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ నేపథ్యంలో ఈ నెల 11న సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?