మా అక్క ప్రాణాలతో వుంటుందో, లేదో: భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 08, 2021, 06:29 PM ISTUpdated : Jan 08, 2021, 10:53 PM IST
మా అక్క ప్రాణాలతో వుంటుందో, లేదో: భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలు

సారాంశం

అఖిలప్రియను జైల్లో టెర్రరిస్టుకన్నా దారుణంగా చూస్తున్నారని ఆరోపించారు ఆమె సోదరి భూమా మౌనికా రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె... అఖిల ప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని ఎద్దేవా చేశారు

అఖిలప్రియను జైల్లో టెర్రరిస్టుకన్నా దారుణంగా చూస్తున్నారని ఆరోపించారు ఆమె సోదరి భూమా మౌనికా రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె... అఖిల ప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చెవుల్లోంచి, ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్పినా వైద్యం చేయించలేదని మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా సంస్కారమంటూ ఆమె ఎద్దేవా చేశారు. ప్రవీణ్ రావును కొట్టి ఉంటే సాక్ష్యాలు ఎక్కడున్నాయని మౌనిక ప్రశ్నించారు.

మా అక్క ప్రాణాలతో ఉంటుందో లేదో అని భయంగా వుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సీన్‌లో లేని చుట్టూ సీన్ క్రియేట్ చేశారని.. మేం తప్పు చేసి వుంటే వ్యవస్థే చూసుకుంటుందని మౌనిక స్పష్టం చేశారు.

అఖిలప్రియ తప్పు చేసిందని పోలీసులే తేల్చేస్తే ఇక జ్యుడీషియరీ ఎందుకని ఆమె నిలదీశారు. సివిల్ సమస్య వుంటే మేం చర్చలకు వస్తామని.. మా అక్క, తమ్ముడితో సమస్య ఉంటే తాను మధ్యవర్తిగా వస్తానని మౌనిక స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?