ఆ నాలుగు శాఖ‌ల్లో వీఆర్ఏల స‌ర్దుబాటు.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!

Published : Jul 23, 2023, 08:38 PM IST
 ఆ నాలుగు శాఖ‌ల్లో వీఆర్ఏల స‌ర్దుబాటు.. తెలంగాణ  సర్కార్ నిర్ణయం!

సారాంశం

ష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏల విద్యార్హత‌ల‌ను బ‌ట్టి నాలుగు శాఖ‌ల్లో వీఆర్ఏల‌ను సర్దుబాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినట్టుగా సమాచారం. ఈ మేరకు వారిని నీటిపారుద‌ల‌, పుర‌పాల‌క శాఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ్, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో వీఆర్ఏల‌ను స‌ర్దుబాటు చేయ‌నున్నారు. అదే సమయంలో 61 ఏళ్లు దాటిన వీఆర్‌ఏల ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీఆర్ఏల స‌ర్దుబాటు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన జీవో సోమ‌వారం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇక, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu