
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. చాకలి ఐలమ్మ వర్థంతిని సందర్భంగా చౌటుప్పల్ లో ఆమె విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం నివాళి అర్పించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడారని అన్నారు. ఆమె గొప్ప ధీరవనిత అని కొనియాడారు.
జాతీయ విద్యా విధానం-2020లో మార్పులు అవసరం: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అమవీరుల స్తూపం నిర్మాణాన్నివెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన చౌటుప్పల్ లో ఉన్న బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు.
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తానని అంటున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలోనే ఏమీ చేయలేని వ్యక్తి, దేశంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండేదని, కానీ దానిని అప్పుడు అప్పుల కుప్పగా మార్చేశారని రాజేందర్ తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణను అవినీతికి అడ్రస్ గా మార్చారని అన్నారు.