sridhar babu : మంథనిలో సీఎం కేసీఆర్ గూండాయిజం సంస్కృతిని ప్రోత్సహిన్నారు - శ్రీధర్ బాబు

By Asianet News  |  First Published Nov 22, 2023, 4:40 PM IST

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథనిలో సీఎం కేసీఆర్ గూండాయిజం, రౌడీయిజం సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.


మంథనిలో సీఎం కేసీఆర్ గుండాయిజం, రౌడీయిజం సంస్కృతిని ప్రొత్సహిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. బుధవారం ఆయన మంథని లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తన నివాసం నుండి ర్యాలీ తీశారు. నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారందరినీ పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. దీంతో పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాటేసిన పామును హాస్పిటల్ కు తీసుకొచ్చిన యువకుడు.. అనంతరం బెడ్ పై ఉంచి వైద్యం

Latest Videos

undefined

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్న కు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారని, అయినా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు.

మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. ప్రయాణికులందరూ చూస్తుండగానే దారుణం.. 

మంథని ప్రాంతంలో ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకూడదా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకంతో బక్కన్న అనే వ్యక్తి జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. అనంతరం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. అలాంటి వ్యక్తిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. అనంతరం ఈ ఘటనపై ఎన్నికల రిటైరింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు ఈ ఘటన పైన నిజానిర్ధారణ చేయాలని కోరారు. దీనిపై ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

click me!