వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కొండా సురేఖ.. అదే మార్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సైతం వెళ్లి, తనకు ఓటు వేయాల్సిందిగా అక్కడి వారిని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అయితే ఈ పరిణామంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు కొంతమేర ఆశ్చర్యపోయారు.
బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కొండా సురేఖ బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో నవ్వుతూ కనిపించారు.
𝗥𝗮𝗴𝗴𝗶𝗻𝗴 𝗟𝗲𝘃𝗲𝗹💯😂😂
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐂𝐚𝐧𝐝𝐢𝐝𝐚𝐭𝐞 𝐀𝐬𝐤𝐢𝐧𝐠 𝐕𝐨𝐭𝐞𝐬 𝐢𝐧 𝐁𝐑𝐒 𝐎𝐟𝐟𝐢𝐜𝐞
వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు ఓటు వెయ్యండి అంటూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
Warangal East… pic.twitter.com/BStsRsU4no