నేను మాట్లాడాల్సింది నువ్వు చెబుతావా: భట్టిపై కేసీఆర్ ఫైర్

Siva Kodati |  
Published : Jul 19, 2019, 01:21 PM IST
నేను మాట్లాడాల్సింది నువ్వు చెబుతావా: భట్టిపై కేసీఆర్ ఫైర్

సారాంశం

కొత్త మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం జరిగింది.

ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులు రాష్ట్రానికి ఏం చేయాలన్నా అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పాటును రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని.. మేము ఆయనను వ్యతిరేకించామని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన పథకాలను యథాతధంగా అమలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.

బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని తాము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. స్థానిక సంస్థల అధికారాలను హరించే ఉద్దేశ్యం తమకు లేదని.. నిధులు ఇచ్చామని, అధికారాలను పెంచామని కేసీఆర్ గుర్తుచేశారు.

అయితే కలెక్టర్‌కు పర్యవేక్షణ పెంచామని తెలిపారు. పంచాయతీరాజ్ మాదిరిగానే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటుందని.. వాళ్లు వైఖరి మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు.

దీనిపై స్పందించిన ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క... ముఖ్యమంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ సమయంలో కలగజేసుకున్న కేసీఆర్.. మీరు చెప్పిందే.. మేం మాట్లాడాలా అంటూ ఫైరయ్యారు. కొత్త పాలసీ మీకు నచ్చకపోతే వ్యతిరేకించవచ్చని.. ఇందులో తాను తప్పు చెప్పింది ఏం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ