మనవడి నిర్వాహకం... క్షమాపణలు చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ

By telugu teamFirst Published Jul 19, 2019, 12:02 PM IST
Highlights

 తెలంగాణ డీజీపీ పపేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనంపై కూర్చుని పోలీసులను కించపరుస్తూ.. హోం మంత్రి మహమూద్ అలీ మనవడు, అతని స్నేహితుడు టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. పోలీసు వ్యవస్థను కించపరిచేలా హోం మంత్రి మనవడు ఇలాంటి వీడియో చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ నగర ప్రజలకు క్షమాపణలు  చెప్పారు. తన మనవడు చేసిన నిర్వాహాకానికి ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఆయన మనవడు చేసిన పని ఏంటో తెలుసా టిక్ టాక్ వీడియో చేయడం. 

ఇంతకీ మ్యాటరేంటంటే... తెలంగాణ డీజీపీ పపేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనంపై కూర్చుని పోలీసులను కించపరుస్తూ.. హోం మంత్రి మహమూద్ అలీ మనవడు, అతని స్నేహితుడు టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. పోలీసు వ్యవస్థను కించపరిచేలా హోం మంత్రి మనవడు ఇలాంటి వీడియో చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఐజీ స్తాయి అధికారిని నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే పీక కోస్తా అనే డైలాగ్ ని హోం మినిస్టర్ మనవడు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై డీజీపీ, ఏడీజీలు చర్చించినట్లు సమాచారం. ఆ పోలీసు వాహనం భద్రత నిమిత్తం హోం మంత్రికి కేటాయించినట్లు తెలిసింది. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో.. మహమూద్ అలీ స్పందించారు.

‘‘ మా కుటుండం ఓల్డ్ సిటీలో పెళ్లికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వచ్చి టిక్ టాక్ చేద్దామని నా మనవడిని అడిగితే చేశాడు. ఇలాంటి వీడియోలు చేయడం తనకు అలవాటులేదు. సరదాగా మాత్రమే చేశాడు. ఆ వీడియో చూసి ముందు మేము కూడా షాక్ అయ్యాం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటాను ’’ అని చెప్పారు. 
 

click me!