పెళ్లిళ్లు, శుభకార్యాలపై మరో నెల రోజుల నిషేధం.. గోడౌన్స్‌గా ఫంక్షన్ హాల్స్‌ : కేసీఆర్

Siva Kodati |  
Published : Apr 19, 2020, 10:13 PM IST
పెళ్లిళ్లు, శుభకార్యాలపై మరో నెల రోజుల నిషేధం.. గోడౌన్స్‌గా ఫంక్షన్ హాల్స్‌ : కేసీఆర్

సారాంశం

రాష్ట్రంలో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలపై ఉన్న నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఫంక్షన్ హాళ్లను సీజ్ చేసి వాటిని ఎరువులను నిల్వ చేసేందుకు ఉపయోగించుకోవచ్చని సీఎం తెలిపారు

రాష్ట్రంలో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలపై ఉన్న నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఫంక్షన్ హాళ్లను సీజ్ చేసి వాటిని ఎరువులను నిల్వ చేసేందుకు ఉపయోగించుకోవచ్చని సీఎం తెలిపారు.

నగదు పంపిణీపై వదంతులు నమ్మి ప్రజలు బ్యాంకుల వద్ద గుమిగూడొద్దని.. ప్రభుత్వం బ్యాంకుల్లో వేసిన డబ్బు ఎక్కడికి పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. మరింత కఠినంగా లాక్‌డౌన్‌గా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

Also Read:మే 7 వరకు తెలంగాణలో లాక్‌డౌన్.. సడలింపులు ఉండవు: కేసీఆర్ ప్రకటన

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 60 వేల వాహనాలను సీజ్ చేసినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఏప్రిల్, మే నెలల్లో ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు రద్దు చేశామన్నారు.

ఆసరా పెన్షన్షు యథావిథిగా కొనసాగుతాయన్న కేసీఆర్.. వలసకూలీలకు 12 కేజీల బియ్యం, రూ,1,500 ఆర్ధిక సాయం ఇస్తామని సీఎం చెప్పారు. టిమ్స్ ఆసుపత్రిగా గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మారుతుందని, సోమవారం నుంచి 1,500 పడకలతో కోవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు.

దీనిపై అధికారాలను క్రీడా శాఖ నుంచి ఆరోగ్య శాఖకు బదిలీ చేసినట్లు సీఎం వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరానికి అధిక ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని.. నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని కేసీఆర్ విద్యా సంస్థలను ఆదేశించారు.

Also Read:హైదరాబాద్‌ లో ఒకే మహిళ నుంచి 80 మందికి కరోనా..!

రైతుల వద్ద వున్న ధాన్యం నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొంటుందని రైతులు ఆందోళన చెందవద్దని సీఎం హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎరువులు  సరఫరా  చేస్తామని, రాష్ట్రం మొత్తానికి సరిపోయేంత స్టాక్ ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu