సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఈ జిల్లాల్లో కలెక్టరేట్ భవనాల ప్రారంభించనున్న సీఎం.. షెడ్యూల్ ఇదే..

Published : Aug 21, 2022, 04:29 PM IST
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఈ జిల్లాల్లో కలెక్టరేట్ భవనాల ప్రారంభించనున్న సీఎం.. షెడ్యూల్ ఇదే..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఆగస్టు 29 నుంచి ఆయన వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఆగస్టు 29 నుంచి ఆయన వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు. ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక, ఈ నెల 29న పెద్దపల్లిలో పర్యటించనున్న కేసీఆర్.. సమీకృత జిల్లా కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. ఇక, ఈ సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లాలో,  సెప్టెంబర్ 10వ తేదీన జగిత్యాల జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్నారు. 

అలాగే ఆయా జిల్లాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో.. అధికారులు అందకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇక, ఇటీవల ఈ నెల 16న  వికారాబాద్‌లో, ఈ నెల 17న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. అక్కడ సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. మరోవైపు శనివారం మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు