ప్రగతి భవన్‌లో దసరా వేడుకలు: స్వయంగా ఆయుధ పూజ చేసిన కేసీఆర్

By Siva KodatiFirst Published Oct 15, 2021, 9:17 PM IST
Highlights

విజయదశమి (vijayadashami) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm) కె. చంద్రశేఖర్ రావు (kcr) ప్రగతి భవన్‎లో (pragathi Bhavan) జరిగిన దసరా (dussehra) వేడుకల్లో పాల్గొన్నారు. ప్రగతి భవన్ ఆవరణలోని నల్లపోచమ్మ (nalla pochamma) అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.

విజయదశమి (vijayadashami) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm) కె. చంద్రశేఖర్ రావు (kcr) ప్రగతి భవన్‎లో (pragathi Bhavan) జరిగిన దసరా (dussehra) వేడుకల్లో పాల్గొన్నారు. ప్రగతి భవన్ ఆవరణలోని నల్లపోచమ్మ (nalla pochamma) అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకుల నుంచి ఆశీర్వదం తీసుకున్నారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా వాహన పూజ, అయుధ (ayudha pooja) పూజ ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత దసరా సందర్భంగా కేసీఆర్ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు.

 

 

ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు (ktr), శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

అంతకుముందు సీఎం కేసీఆర్ స్వయంగా వాహన పూజ చేశారు. తను నిత్యం ప్రయాణించే వాహనానికి మంగళ హారతి ఇచ్చి.. కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టారు. తర్వాత ఆయుధ పూజ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం ప్రగతి భవన్‌లో విజయదశమి రోజున పూజలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 


 

click me!