గుండెపోటుతో కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి

Published : Feb 12, 2021, 03:10 PM IST
గుండెపోటుతో కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి

సారాంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్ కుమార్, కేసీఆర్ కలిసి చదువుకున్నారు. ఇద్దరు మంచి మిత్రులు. చదువుకునే రోజుల్లో ఒకే గదిలో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. 

కొద్ది నెలల కిందట ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కరీంనగర్ వచ్చినప్పుడు సంపత్ కుమార్ ఉత్తర తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలిసేందుకు వచ్చారు. సంపత్ కుమార్ ను చూసిన కేసీఆర్ చిరునవ్వుతో పలకరించి, ఎదురెళ్లి, ఆప్యాయంగా హత్తుకున్నారు.

అంతేకాదు అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు సంపత్ కుమార్ ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. దీంతో సంపత్ కుమార్ చాలా సంతోషపడ్డారు. కాగా సంపత్‌కుమార్‌ పెళ్లి చేసుకోలేదు. అవివాహితుడు దీంతో ఆయన సోదరుడు సంపత్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video