
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు కేశవరావును ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కెకె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం. ఎన్నిరోజుల చికిత్స అవసరమవుతుందని డాక్టర్ల ద్వారా సమాచారం తెలుసుకున్నారు సిఎం కెసిఆర్. కెసిఆర్ వెంట డిప్యూటీ సీఎంలు మహముద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో కేకే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కెకె త్వరగా కోలుకోవాలని సిఎం ఆకాంక్షించారు.