ప్రగతి నివేదన సభకు కౌంటర్ ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభ

By rajesh yFirst Published Sep 2, 2018, 5:20 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా ఓయూలో దళిత విద్యార్థి సంఘాలు నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ ఓయూ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అయితే విద్యార్ధుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు వాగ్వాదం చోటు చేసుకుంది. 

హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా ఓయూలో దళిత విద్యార్థి సంఘాలు నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ ఓయూ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అయితే విద్యార్ధుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఆ తర్వాత విద్యార్థులు ఆర్ట్స్‌ కాలేజీ వద్ద నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభ వరకు ర్యాలీగా వెళ్లారు. తన ఉనికిని కాపాడుకోవాడానికే కేసీఆర్‌ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విద్యార్థి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

click me!