తెలంగాణ బడ్జెట్.. వారికి మరోసారి మొండి చేయి..!

Published : Mar 18, 2021, 02:58 PM IST
తెలంగాణ బడ్జెట్.. వారికి మరోసారి మొండి చేయి..!

సారాంశం

కరోనా, పతనమవుతున్న చమురు ధరలకు తోడుగా శరవేగంగా వస్తున్న ఉద్యోగాల స్ధానికరణ తదితర కారణాల వల్ల పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు తిరిగి వస్తున్న నేపథ్యంలో బడ్జెటుపై నిరాశ నెలకొంది.

తెలంగాణ ప్రభుత్వం గురవారం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ బడ్జెట్ లో గల్ఫ్ ప్రవాసులకు ప్రభుత్వం మొండి  చేయి చూపించింది.గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గత ఆరేళ్లుగా చెబుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరా బడ్జెట్ వచ్చే సరికి మొండి చేయి చూపుతోంది. 

ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఈసారి 2021-22 బడ్జెట్‌‌లో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం తన పాత పాటను వల్లించింది తప్ప ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్‌తో సహా టీఆర్ఎస్‌ అనేక మంది కీలక నేతలు ఈసారి బడ్జెట్‌‌లో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో మాత్రం ఏలాంటి కేటాయింపులు చేయలేదు. 

కరోనా, పతనమవుతున్న చమురు ధరలకు తోడుగా శరవేగంగా వస్తున్న ఉద్యోగాల స్ధానికరణ తదితర కారణాల వల్ల పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు తిరిగి వస్తున్న నేపథ్యంలో బడ్జెటుపై నిరాశ నెలకొంది.

PREV
click me!

Recommended Stories

సినిమా హీరో రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Grand Mass Entry
కేసీఆర్ రాసిపెట్టుకో.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ | CM Revanth Reddy Strong Warning to KCR