గవర్నర్ తో సిఎం భేటీ

Published : Oct 28, 2016, 12:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
గవర్నర్ తో సిఎం భేటీ

సారాంశం

గవర్నర్ ను కలసిన కెసిఆర్ తాజా పరిణామాలపై వివరణ

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తో సిఎం కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. దీపావళి సుభాకాంక్షలు తెలపటంతో పాటు గడచిన మూడు రోజులుగా జరిగిన పరిణామాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. సచివాలయంను కూలగొట్టి వాస్తు ప్రకారం కొత్త భవనాలను నిర్మించాలని కెసిఆర్ భావించారు.

ఆ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఏపి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను స్వాధీన చేసుకునేందుకు కూడా కెసిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు గవర్నర్ కూడా కెసిఆర్ కు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణా ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను ఖాళీ చేయిస్తున్నారు.

 అయితే, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కెసిఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దాంతో సదరు కేసును న్యాయస్ధానం విచారణకు స్వీకరించింది. ఒక వేళ కూల్చివేతలపై న్యాయస్ధానం గనుక స్టే ఇస్తే ఏమి చేయాలన్నది కెసిఆర్ ను తీవ్రంగా తొలిచేస్తోంది.

ఇక, గురువారం తమ డిమాండ్ల సాధన కోసం వేలాది మంది హోం గార్డులు సచివాలయంను ముట్టడించారు. దాంతో పోలీసులు హోంగార్డులపై విచక్షణా రహితంగా లాఠీలను ఝుళిపించారు.

  అంతే కాకుండా గడచిన వారం రోజులుగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ డిమాండ్ తో వేలాది మంది విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. వారిపైన కూడా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. దాంతో ప్రభుత్వ విధానంపై తెలంగాణా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు హోం గార్డులకు, విద్యార్ధులకు మద్దతుగా నిలిచాయి. ఇటువంటి అనేక అంశాలపై సిఎం గవర్నర్ కు వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది.

 

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?