దిశ హత్య కేసు... లారీ క్యాబీన్ తలుపులపై రక్తపు మరకలు

By telugu teamFirst Published Dec 6, 2019, 7:49 AM IST
Highlights

షాద్ నగర్ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగటలిగే సూపర్ లైట్ పరికరాన్ని వినియోగించి ఆధారాలను సేకరించారు.
 

దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో... నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని... అందులో భాగంగానే పోలీసులపై ఎదురుతిరిగారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురు నిందితులను కుక్కలను కాల్చినట్లు కాల్చిపరేశారు.

కాగా... ఈ ఎన్ కౌంటర్ కి ముందు దిశ హత్య నేపథ్యంలో... ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. నిందితులను అరెస్టు చేసిన సమయంలోనే పలు ఆధారాలను సేకరించినా కేసు న్యాయస్థానంలో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. ఈ క్రమంలో శంషాబాద్ తొండుపల్లి, షాద్ నగర్ చటాన్ పల్లిల్లోని సంఘటన స్థలాల్లో గురువారం క్షుణ్నంగా తనిఖీలు చేశారు.

షాద్ నగర్ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగటలిగే సూపర్ లైట్ పరికరాన్ని వినియోగించి ఆధారాలను సేకరించారు.

శంషాబాద్ టోల్ ప్లాజా నుంచి దిశను కొత్తూరు జేపీ దర్గా వద్దకు తీసుకువెళ్లిన దుండగులు మరోసారి అకృత్యానికి పాల్పడ్డారు. అనంతరం చటాన్ పల్లికి తీసుకువెళ్లి కాల్చి చంపారు. ఆ సమయంలో లారీలో ఆధారాలు దొరకకుండా నిందితులు శుభ్రం చేశారు. అయినప్పటికీ.. పోలీసులకు దిశ వెంట్రుకలు దొరికాయి. తాజాగా సూపర్ లైటను వినియోగించి లారీ క్యాబిన్ లో రక్తపు మరకల్ని గుర్తించారు. డ్రైవర్ వైపు కాకుండా మరో వైపు తలుపుపై ఈ మరకలను గుర్తించారు. దిశ సెల్ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

click me!