కాళేశ్వరం పర్యటనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు బుధవారం నాడు అడ్డుకున్నారు. ప్రాజెక్టు పరిశీలనకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైపునకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ తోపులాటలో భట్టి విక్రమార్కకు సొమ్మసిల్లి పడిపోయాడు.
భూపాలపల్లి: పోలీసులకు సీఎల్పీ బృందానికి జరిగిన తోపులాటలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సొమ్మసిల్లి పడిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బుధవారం నాడు సీఎల్పీ బృందం వెళ్తుంది.ఈ బృందాన్ని భూపాలపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని సీఎల్పీ బృందం తేల్చి చెప్పింది. పోలీసుల తీరును నిరసిస్తూ సీఎల్పీ బృందం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దగింది. అంతేకాదు ప్రాజెక్టు వైపునకు వెళ్లే ప్రయత్నం చేయబోయారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ తోపులాటతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పృహ కోల్పోయారు.
ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని మంగళవారం నాడు ప్రారంభించింది. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనందున ప్రాజెక్టు సందర్శనకు పోలీసులు అనుమతివ్వలేదు. భద్రాచలంలోనే సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల రీత్యా పోలీసులు అడ్డుకోవడంపై సీఎల్పీ బృందం రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగింది. వారం రోజుల క్రితమే తాము ఈ పర్యటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే ప్రాజెక్టును సందర్శించకుండా అడ్డుకున్నారని శ్రీధర్ బాబు చెప్పారు.
undefined
తాము ప్రాజెక్టులు సందర్శిస్తే అక్కడ జరిగిన తప్పులు బయటకు వస్తాయనే భయంతో ప్రభుత్వం తమను అడ్డుకుంటుందని శ్రీధర్ బాబు ఆరోపించారు.ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత మాసంలో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పంపు హౌస్ నీటిలో మునిగింది. పంపు హౌస్ నీటిలో ముంపునకు గురి కావడంపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనే దానికి కాళేళ్వరం పంప్ హౌస్ నీట మునకే కారణమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
also read:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అరెస్ట్.. ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
గత వారంలో హైద్రాబాద్ లో సమావేశమైన సీఎల్పీ ప్రాజెక్టుల సందర్శనను చేయాలని నిర్ణయం తీసుకొంది. గత మాసంలో వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావించారు. గత మాసంలో వచ్చిన వరదలతో కడెం ప్రాజెక్టుు కొట్టుకుపోయే పరిస్థితి ఉందనే ప్రచారం నెలకొనడంతో ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉందో ప్రాజెక్టుల సందర్శన ద్వారా బయటపెట్టాలని సీఎల్పీ భావించింది. అయితే నిన్న, ఇవాళ కూడా ప్రాజెక్టు ల వద్దకు వెళ్లకుండానే పోలీసులు సీఎల్పీ బృందాన్ని అడ్డుకున్నారు.