కేసీఆర్‌ను ఫాలో అయితే.. డబ్బున్నోళ్లే సీఎంలు: భట్టి

Siva Kodati |  
Published : Jun 13, 2019, 08:13 PM IST
కేసీఆర్‌ను ఫాలో అయితే.. డబ్బున్నోళ్లే సీఎంలు: భట్టి

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై ఫైరయ్యారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. టీఆర్ఎ‌స్‌లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ తాను చేపట్టిన నిరాహార దీక్షకు మద్ధతుగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై ఫైరయ్యారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. టీఆర్ఎ‌స్‌లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ తాను చేపట్టిన నిరాహార దీక్షకు మద్ధతుగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరి మద్ధతు కావాలని... తాను చేపట్టిన ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని.. తమ పార్టీ తరపున ఇంకా పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్ పుట్టలో దాక్కొని ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని... ఆయనను పుట్టలోంచి ఎలా బయటకు రప్పించాలో తమకు తెలుసునన్నారు.

ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపింది నిజం కాదా అని భట్టి ప్రశ్నించారు. రాజకీయ మాఫియాను ఆపకపోతే ప్రజల ఓటుకు విలువ పడిపోతోందని విక్రమార్క హెచ్చరించారు.

భవిష్యత్తులో డబ్బున్నోళ్లంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ముఖ్యమంత్రులు అవుతారని భట్ట విమర్శించారు. త్వరలో వివిధ వర్గాల మేధావులతో ఫిరాయింపులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని విక్రమార్క తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే