నన్ను నష్టపరిచి.. పార్టీని ఆక్రమించుకోవాలని ‘‘కొందరి’’ కుట్ర : భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 2, 2022, 8:26 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సమావేశానికి తాను వెళ్లడం పీసీసీ చీఫ్, ఏఐసీసీ నిర్ణయమేని అన్నారు. సీఎంతో భేటీపై రేవంత్, ఠాగూర్ స్పష్టత ఇవ్వాలని అడిగినా స్పందించలేదన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సమావేశానికి తాను వెళ్లడం పీసీసీ చీఫ్, ఏఐసీసీ నిర్ణయమేని అన్నారు. సీఎంతో భేటీపై రేవంత్, ఠాగూర్ స్పష్టత ఇవ్వాలని అడిగినా స్పందించలేదన్నారు. నాలాంటి వారిని నష్టపరిచి పార్టీని ఆక్రమించుకోవాలనేది కుట్ర అంటూ భట్టి వ్యాఖ్యానించారు. పార్టీని వీక్ చేసి వ్యక్తిగత లాభం పొందాలన్నది కొందరి ప్లాన్ అంటూ విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు ఇతర పార్టీలకు చెందిన  నేతలు ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవడం సంస్కారమని టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల కేటీఆర్‌తో (ktr) సంభాషణపై క్లారిటీ ఇచ్చారు. తాను కేటీఆర్ కోవర్ట్‌ని అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ (congress) నేతలు లేరా అని ఆయన ప్రశ్నించారు. 

ALso Read:నేను టీఆర్ఎస్ ఏజెంట్‌నట.. కేటీఆర్‌తో కాంగ్రెస్ నేతలు కలవలేదా : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో వ్యక్తిగత పంచాయతీలు లేవని జగ్గారెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఏజెంట్‌నని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకులపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారైందని.. పోవాలనుకుంటే డైరెక్ట్‌గా టీఆర్ఎస్‌లోకే (trs) వెళ్లిపోతానని ఆయన స్పస్టం చేశారు. పీసీసీ అంటే చాలా బాధ్యత గల పోస్ట్ అని జగ్గారెడ్డి హితవు పలికారు. 

పార్టీని నాశనం చేస్తున్నాది నేనా...? ఓ వ్యక్తి అభిమాన సంఘాలా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రయాణికులంతా డ్రైవర్‌పై ఆధారపడి వుంటారని.. ప్రమాదం జరిగితే డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు చనిపోతారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ కాంగ్రెస్‌కు డ్రైవర్‌లాంటి వారేనని ఆయన అన్నారు. మేమంతా ప్రయాణికులమేనని.. డ్రైవర్ పోస్ట్ బాధ్యత గలదని జగ్గారెడ్డి సూచించారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేశారని.. నేను ఆయన భుజంపై చేయి వేయలేదన్నారు. 

click me!