బండి సంజయ్ జన జాగరణ్ దీక్షను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jan 02, 2022, 07:38 PM IST
బండి సంజయ్ జన జాగరణ్ దీక్షను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

సారాంశం

తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) కరీంనగర్‌లోని (karimnagar) క్యాంప్ ఆఫీస్ దగ్గర దగ్గర ఉద్రిక్త పరిస్ధితి చోటు చేసుకుంది. ఆదివారం ఆయన చేపట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. 

తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) కరీంనగర్‌లోని (karimnagar) క్యాంప్ ఆఫీస్ దగ్గర దగ్గర ఉద్రిక్త పరిస్ధితి చోటు చేసుకుంది. ఆదివారం ఆయన చేపట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లి బీజేపీ కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చారు పోలీసులు. 317 జీఓ సవరించాలని జాగరణ చేపట్టారు బండి సంజయ్. విషయం తెలుసుకన్న ఉద్యోగులు, కార్యకర్తలు బండి సంజయ్ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. వేల మందితో కేటీఆర్ (ktr) చేపట్టిన ర్యాలీకి లేని రూల్స్ బీజేపీకే ఎందుకంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ