పుట్టినరోజు నాడు విషాదం: బావిలో దూకి టెన్త్ విద్యార్ధి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Dec 14, 2020, 10:00 PM ISTUpdated : Dec 14, 2020, 10:01 PM IST
పుట్టినరోజు నాడు విషాదం: బావిలో దూకి టెన్త్ విద్యార్ధి ఆత్మహత్య

సారాంశం

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. మల్యాల మండలం మ్యాడంపల్లిలో పదో తరగతి చదువుతున్న జలందర్‌ అనే విద్యార్థి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. మల్యాల మండలం మ్యాడంపల్లిలో పదో తరగతి చదువుతున్న జలందర్‌ అనే విద్యార్థి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు..

ఆదివారం ఇంట్లో నుంచి అదృశ్యమైన విద్యార్థి రాత్రి వరకు కూడా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకి లభించలేదు.. గ్రామ శివారులో ఈ రోజు వ్యవసాయ బావి వద్ద ఉన్న చెప్పులను గుర్తించి బావిలో వెతికారు.

మృత దేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినితో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు.

జలందర్‌ తల్లిదండ్రులు మాత్రం హత్యచేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు... జలందర్‌ పుట్టిన రోజు కావటం.. ఆ రోజే ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu