హైదరాబాద్ చైతన్యపురిలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదువుతోన్న విద్యార్ధిని శ్రేష్టవి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ చైతన్యపురిలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదువుతోన్న విద్యార్ధిని శ్రేష్టవి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. విశాఖపట్టణంలో ఇటీవలనే భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే భార్య పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 20వ తేదీని ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకున్న నాలుగు మాసాల తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇదిలావుండగా ఈ నెల 19న విశాఖపట్టణంలోని లాడ్జీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
Also REad:హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ థర్ఢ్ ఇయర్ విద్యార్ధిని సూసైడ్
ఇదిలావుండగా.. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్‌లో ఇంజనీరింగ్ మూడో తరగతి చదువుతున్న విద్యార్ధిని శ్రావణి బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రావణి ఇంజనీరింగ్ చదువుతుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.