వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న గ్రూపు తగాదాలు, కొట్టుకొన్న నేతలు: కారు ధ్వంసం, పోలీసులకు ఫిర్యాదు

Published : Aug 09, 2020, 12:56 PM ISTUpdated : Aug 09, 2020, 12:58 PM IST
వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న గ్రూపు తగాదాలు, కొట్టుకొన్న నేతలు: కారు ధ్వంసం, పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకొన్నారు. అంతేకాదు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు.

వరంగల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకొన్నారు. అంతేకాదు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు.

ఆదివారం నాడు వరంగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోనే యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకొన్నారు. కర్రలతో పరస్పరం దాడికి దిగారు. కార్యాలయ ఆవరణలో ఉన్న ఇతర నేతలు ఇరువర్గాలను ఆపే ప్రయత్నాలు చేశారు.

యూత్ కాంగ్రెస్ నేతల ఘర్షణ సమయంలో పార్టీ కార్యాలయ ఆవరణలో పార్క్ చేసిన ఓ కారు కూడ ధ్వంసమైంది.  పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. డీసీసీ  అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పట్టణ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకొంది. 

ఈ రెండు వర్గాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయ ఆవరణలోనే గొడవకు దిగారు. ఈ గొడవకు కారణాలు ఏమిటనే విషయమై తెలియాల్సి ఉంది. అయితే ఇరు వర్గాల నుండి పార్టీ నాయకత్వం గొడవకు సంబంధించి సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?