తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కేసులు

Published : Aug 09, 2020, 08:50 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 79 వేల మార్కు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 2 వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో తెలంగాణలో 1982 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 79,495కు చేరుకుంది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 627కు చేరుకుంది. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 

తెలంగాణలో గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కేసుల సంఖ్య

ఆదిలాబాద్ 12
భద్రాద్రి కొత్తగూడెం 64
జీహెచ్ఎంసి 463
జగిత్యాల 42
జనగామ 78
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 93
కామారెడ్డి 96
ఖమ్మం 47
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 43
మహబూబాబాద్ 17
మంచిర్యాల 31
మెదక్ 26
మేడ్చెల్ మల్కాజిగిరి 141
ములుగు 21
నాగర్ కర్నూలు 23
నల్లగొండ 59
నారాయణపేట 3
నిర్మల్ 47
నిజామాబాద్ 58
పెద్దపల్లి 71
రాజన్న సిరిసిల్ల 29
రంగారెడ్డి 139
సంగారెడ్డి 49
సిద్దిపేట 55
సూర్యాపేట 20
వికారాబాద్ 10
వనపర్తి 28
వరంగల్ రూరల్ 40
వరంగల్ అర్బన్ 71
యాదాద్రి భువనగిరి 16
మొత్తం 1982

 

PREV
click me!

Recommended Stories

Liquor prices Hike : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. తెలుగు మందుబాబులపై ఇరాన్ వార్ ఎఫెక్ట్..!
Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu