మంత్రి మేనల్లుడు దాడి: కాంగ్రెస్,టీఆర్ఎస్ ఘర్షణ, ఉద్రిక్తత

Published : Dec 06, 2018, 08:26 AM ISTUpdated : Dec 06, 2018, 08:28 AM IST
మంత్రి మేనల్లుడు దాడి: కాంగ్రెస్,టీఆర్ఎస్ ఘర్షణ, ఉద్రిక్తత

సారాంశం

 నిర్మల్‌లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకొంది. నివురు గప్పిన నిప్పులా నిర్మల్‌లో పరిస్థితి ఉంది


నిర్మల్: నిర్మల్‌లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకొంది. నివురు గప్పిన నిప్పులా నిర్మల్‌లో పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు  అదనపు బలగాలను మోహరించారు. 

నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకొంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు తమ మీద దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ దాడిని నిరసిస్తూ టీఆర్ఎస్ కు చెందిన  నేత కారును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు పార్టీల  మధ్య ఘర్షణతో  నిర్మల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

టీఆర్ఎస్‌ కార్యకర్తల దాడిని నిరసిస్తూ  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.ఇరువర్గాల దాడులతో నిర్మల్‌లో  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?