నందమూరి సుహాసిని కోసం ఓట్ల కొనుగోలు: ముగ్గురి అరెస్టు

Published : Dec 06, 2018, 07:59 AM IST
నందమూరి సుహాసిని కోసం ఓట్ల కొనుగోలు: ముగ్గురి అరెస్టు

సారాంశం

తమకు అందిన సమాచారం మేరకు బుధవారంనాడు పోలీసులు కెపిహెచ్ బీ ఫేజ్ - 4కు చేరుకుని డబ్బులు పంచుతున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

హైదరాబాద్: కూకట్ పల్లి ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని కోసం ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై కేపిహెచ్ బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు బుధవారంనాడు పోలీసులు కెపిహెచ్ బీ ఫేజ్ - 4కు చేరుకుని డబ్బులు పంచుతున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

నిందితులను కలిదిండి శ్రీనివాస రాజు (48), కిమావత్ శ్రీరామ్ (36), అతని భార్య కిమావత్ ఇంద్రజ (27)లుగా గుర్తించారు. ముగ్గురు కూడా స్థానికులే. కిమావత్ శ్రీరామ్ దర్జీ. సుహాసినీకి ఓటు వేయడానికి ఆ ముగ్గురు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

వారి నుంచి రూ. 12,300 స్వాధీనం చేసుకున్నట్లు, కేసు దర్యాప్తు సాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఇదిలావుంటే, డబ్బులు పంపిణీ చేస్తుండగా వనస్థలిపురంలో టీఆర్ఎస్ కార్పోరేటర్ ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ