తెలంగాణలో పోడు భూముల రచ్చ: ఘర్షణ, ఒకరి మృతి

By narsimha lodeFirst Published Jul 8, 2019, 11:23 AM IST
Highlights

ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల మండలం కుదునూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గిరిజన నేత రాఘవయ్య మృతి చెందారు. 
 

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల మండలం కుదునూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గిరిజన నేత రాఘవయ్య మృతి చెందారు. 

చర్ల మండలం కుదునూరులో దళితులు, గిరిజనుల మధ్య ఆదివారం రాత్రి  ఘర్షణ చోటు చేసుకొంది. చాలా రోజులుగా ఈ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  ఈ ఘర్షణలో భాగంగా ఆదివారం నాడు ఓ వర్గం వారు గిరిజనులపై దాడికి దిగారు.

రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో రాఘవయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాఘవయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ ఘటనతో ఏజెన్సీ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది.  ఏజెన్సీ గ్రామాల్లో పోడు భూముల విషయంలో  గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం సాగుతోంది. 

click me!