ఉత్తమ్‌పై సర్వే షాకింగ్ కామెంట్స్: మీటింగ్‌లో గందరగోళం

By narsimha lodeFirst Published Jan 6, 2019, 3:16 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టీపీసీసీ చీఫ్  ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు కుంతియాపై విమర్శలు గుప్పించారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టీపీసీసీ చీఫ్  ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు కుంతియాపై విమర్శలు గుప్పించారు. దీన్ని అడ్డుకొన్నవారిపై సర్వే సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుండి వాకౌట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా సోమవారం నాడు గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టనున్నట్టు సర్వే  ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం గాంధీ భవనంలో జరిగింది.

ఈ సమావేశంలో  మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాపై తీవ్ర స్థాయిలో  విమర్శలు గుప్పించారు.

దీంతో బొల్లు కిషన్, మహేష్‌లు సర్వే సత్యనారాయణ ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినా కూడ సర్వే సత్యనారాయణ మాత్రం తగ్గలేదు. తన విమర్శలను కొనసాగించారని బొల్లు కిషన్ ఆరోపించారు. కిషన్ పై సర్వే సత్యనారాయణ ఆగ్రహంతో  వాటర్ బాటిల్ ను విసిరేశారు.

సమావేశం నుండి  ఆయన బయటకు వచ్చారు.గాంధీ భవన్  వేదికగా చేసుకొని సర్వే సత్యనారాయణ మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాపై విమర్శలు గుప్పించారు. పార్టీ నాయకత్వం కొందరు దద్దమ్మలను, రౌడీలను పక్కన కూర్చోబెట్టుకొని తనపై దాడులకు పాల్పడే ప్రయత్నం చేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందో తాను బట్టబయలు చేస్తానని ఆయన  ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానానికి ఉత్తమ్ పై ఫిర్యాదు చేస్తానని సర్వే హెచ్చరించారు.కొందరు దద్దమ్మలు తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

పార్టీని బలోపేతం చేసే విషయమై తాను చెప్పిన మాటలను పార్టీ నాయకత్వం రుచించలేదన్నారు. అందుకే కొందరిని ఉద్దేశ్యపూర్వకంగానే తనపై దాడికి పాల్పడే ప్రయత్నించారని ఆరోపించారు.

సర్వే సత్యనారాయణ వ్యాఖ్యలను పార్టీ సీనియర్లు అభ్యంతరం చెప్పారు. అదే సమయంలో బొల్లు కిషన్ అడ్డు చెప్పారు. దీంతో కిషన్ పై సర్వే సత్యనారాయణ అడ్డుకొన్నారు.వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. కోపంతో  సర్వే సత్యనారాయణ కిషన్‌పై వాటర్ బాటిల్ విసిరారు. సమావేశం నుండి కూడ సత్యనారాయణ బహిష్కరించారు.

సంబంధిత వార్తలు

సర్వేకు షాక్: కాంగ్రెస్‌ నుండి సస్పెన్షన్


 

click me!