కోస్గిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత...

Published : Feb 17, 2022, 04:43 PM IST
కోస్గిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత...

సారాంశం

నారాయణపేట జిల్లా (Narayanpet district) కోస్గిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకన్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  

నారాయణపేట జిల్లా (Narayanpet district) కోస్గిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు కోస్గిలో సంబరాలు చేసుకున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని గాడిదలకు బర్త్ డే వేడుకలు జరపాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నారాయణ పేట్ జిల్లా కొస్గి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో యూత్ కాంగ్రెస్ నేతలు.. గాడిదకు బర్త్ డే జరిపేందుకు సిద్దం అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. అక్కడి చేరకుని కాంగ్రెస్ శ్రేణులపై దాడికి యత్నించాయి. దీంతో అక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకన్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలకు చెదరగొట్టారు. అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు యత్నించారు. ఇక, కోస్గి ఎలాంటి అమమానకర సంఘటనలు చోటుచేసుకున్న ఉపేక్షించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన (KCR Birthday) వేడుకలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌ అలీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇక, తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేసీఆర్ జన్మదినం...ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అంటూ ప్రశ్నలు సంధించారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #TelanganaUnemployementDay అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు.

రేవంత్ రెడ్డి అరెస్టును తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఠాగూర్... నిరుద్యోగుల పక్షాన రేవంత్ మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణ సాధనలో ప్రధాన ఎజెండాగా ఉన్న నిరుద్యోగ సమస్యను కేసీఆర్ తన ఎజెండాలో లేదని మరోసారి నిరూపించుకున్నారని మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.