కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ మత్స్యకారుల ఘర్షణ.. రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు..

Published : May 30, 2022, 05:41 PM ISTUpdated : May 30, 2022, 06:10 PM IST
కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ మత్స్యకారుల ఘర్షణ.. రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు..

సారాంశం

కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రింగ్ వలలు వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మత్స్యకారుల మధ్య కొంతకాలంగా వివాదం చోటుచేసుకుంది. రింగ్ వలల వివాదానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని సమాచారం. ఈ క్రమంలోనే నేడు మాటమాట పెరిగి ఇరు రాష్ట్రాల మత్స్యకారులు ఘర్షణకు దిగారు. 

ఈ క్రమంలోనే ఏపీ మత్స్యకారులను తెలంగాణ మత్స్యకారులు చందంపేటకు తీసుకుని వచ్చారు. ఇదే విషయాన్ని ఏపీ మత్స్యకారులు తమవారికి తెలియజేశారు. ఆ తర్వాత దీనిపై సమాచాంర అందుకున్న ఏపీ పోలీసులు చందంపేటకు వచ్చి ఆ రాష్ట్ర మత్స్యకారులను విడిపించి తీసుకెళ్లారు. అయితే రింగ్ వలలు వేయకుండా చూడాలని నల్గొండ జిల్లా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?