సిద్దిపేట జిల్లాలో రఘునందన్‌రావు పర్యటనలో ఉద్రిక్తత.. బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం..

Published : Dec 17, 2022, 04:44 PM IST
సిద్దిపేట జిల్లాలో రఘునందన్‌రావు పర్యటనలో ఉద్రిక్తత.. బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం..

సారాంశం

సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం రుద్రారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 

సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం రుద్రారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వివరాలు.. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం రుద్రారంకు వచ్చారు. అయితే ఎమ్మెల్యే రఘునందన్‌రావును బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి  చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం నూతనంగా  నిర్మించిన అక్బర్‌పేట్ భూంపల్లి ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. ఎమ్మార్వో కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. అయితే బీజేపీ , టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపోటీ నినాదాలు చేశారు. తర్వాత ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu