ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట..

By Sumanth KanukulaFirst Published Aug 24, 2022, 4:04 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిటీ సివిల్ కోర్టులో భారీ ఊరట దక్కింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిటీ సివిల్ కోర్టులో భారీ ఊరట దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. 

బీజేపీ ఎంపీ పర్వేష్  వర్మ, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సిర్సాలకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. సభలలో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా నిరధారమైన ఆరోపణలు చేయవద్దని సూచించింది. కవిత దాఖలు చేసిన పరువు నష్టం దావాపై తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. 

click me!