ద్వేషం కాదు.. దేశం ముఖ్యం: మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

Published : Aug 24, 2022, 03:48 PM IST
ద్వేషం కాదు.. దేశం ముఖ్యం: మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

సారాంశం

గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు సంధించారు. కేంద్రంలో ఉంది మోదీ ప్రభుత్వం కాదని.. అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వం అని విమర్శించారు.

గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు సంధించారు. కేంద్రంలో ఉంది మోదీ ప్రభుత్వం కాదని.. అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వం అని విమర్శించారు. దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించాు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి, భారమవుతున్న నిత్యవసరాల నుంచి, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి.. ప్రజలు దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని కేటీఆర్ వరుస ట్వీట్స్ చేశారు. 

ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని అన్నారు. ‘‘దేశం కోసం..ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదం.. కానీ విద్వేశం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి ఇంటికి నీరు అన్నారని.. కానీ ప్రతి ఇంటికి విషం, ప్రతి గుండెలో విషం నింపే  కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 

పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని, సమాజంలో ఒకరితో ఒకరికి సంబంధాలను దెబ్బతిసే కుతంత్రం చేస్తున్నారని ఆరోపించారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని గుర్తుంచుకోవాలని కోరారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని చెప్పారు. చివరిలో జై హింద్ అంటూ ట్వీట్స్‌ను ముగించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?