కాకినాడలో కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు: క్రిస్టియన్ యూత్ ఫెలోషిఫ్ తీర్మానం

By narsimha lode  |  First Published Oct 4, 2022, 10:16 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి మద్దతుగా క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సమావేశం సోమవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రతిని కేసీఆర్ కు అందించాలని సంస్థ సభ్యులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చిన్నయ్య, రాజేశ్వరరావులను కోరారు. 


కాకినాడ: జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్  మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సమావేశం సోమవారం నాడు జరిగింది.ఈ సమావేశానికి బెల్లంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ రాజేశ్వరరావులు హజరయ్యారు. కేసీఆర్  జాతీయ పార్టీ ఏర్పాటులో  విజయం సాధించాలని  ఈసందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కేసీఆర్ ఏర్పాటు చేసే పార్టీకి మద్దతుగా చేసిన తీర్మానాన్ని కేసీఆర్ కు అందించాలని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్  సభ్యులు ఎమ్మెల్యే చిన్నయ్య, ఎమ్మెల్సీ రాజేశ్వరరావులకు అందించారు. 

హైద్రాబాద్ లో నిర్వహించే సమావేశానికి తాము మద్దతిస్తామని ఈ సమావేశం ప్రకటించింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఏర్పాటు చేసే పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సభ్యులు తెలిపారు.

దసరా రోజునతెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్  పేరుతోనే జాతీయ రాజకీయాల్లో కి వెళ్లడం సముచితం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్  పేరును బీఆర్ఎస్ లేదా మరో పేరుతో వెళ్లాలని భావిస్తున్నారు.  జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని  భావిస్తున్నందున పేరు మార్పు  అనివార్యంగా మారింది. అయితే ఈ కారణంగా  ఎన్నికల గుర్తు కారు అలానే ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దసరా రోజున నిర్వహించే  పార్టీ సమావేశం ఈ విషయమై తీర్మానం చేయనుంది.ఈ తీర్మానాన్ని ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి అందించనున్నారు.

Latest Videos

undefined

also read:దసరా రోజున యధావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం: కేసీఆర్

కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తున్న విధానాల కారణంగానే  ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపిస్తున్నారు.కేంద్రంోని  బీజేపీ అధికారాన్ని కోల్పోతేనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రాదని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈ ప్రక్రియలో టీఆర్ఎస్ క్రియాశీలకంగా వ్యవహరించనుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే కేసీఆర్  జాతీయపార్టీ ఏర్పాటు చేయనున్నారు. 

click me!