స్వపక్షం.. విపక్షం రాజకీయాల్లోనే వుంటాయ్, మాకంతా సమానమే: కేసీఆర్‌తో విభేదాలంటూ ప్రచారంపై చినజీయర్

Siva Kodati |  
Published : Feb 18, 2022, 03:53 PM ISTUpdated : Feb 18, 2022, 03:59 PM IST
స్వపక్షం.. విపక్షం రాజకీయాల్లోనే వుంటాయ్, మాకంతా సమానమే: కేసీఆర్‌తో విభేదాలంటూ ప్రచారంపై చినజీయర్

సారాంశం

తెలంగాణ  సీఎం కేసీఆర్‌తో (kcr) వివాదాలు వున్నట్లుగా వస్తున్న వార్తలపై చినజీయర్ స్వామి (chinna jeeyar swamy ) స్పందించారు.  మాకు అందరూ సమానమేనని.. అందరూ సమతామూర్తిని దర్శించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే వుంటాయని చినజీయర్ పేర్కొన్నారు. 

తెలంగాణ  సీఎం కేసీఆర్‌తో (kcr) వివాదాలు వున్నట్లుగా వస్తున్న వార్తలపై చినజీయర్ స్వామి (chinna jeeyar swamy ) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో మాకు విభేదాలు ఎందుకు వుంటాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పూర్తి సహకారం వున్నందుకే  కార్యక్రమం విజయవంతం అయ్యిందని చినజీయర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి తాను ప్రథమ సేవకుడనని కేసీఆర్ అన్నారని చినజీయర్ అన్నారు. కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం లేదా... పనుల ఒత్తిడి కారణం అవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు కూడా శాంతి కళ్యాణానికి కేసీఆర్‌ను ఆహ్వానించామని చినజీయర్ పేర్కొన్నారు. ఆయన వస్తారో.. రారో చూడాలని స్వామిజీ అన్నారు. మాకు అందరూ సమానమేనని.. అందరూ సమతామూర్తిని దర్శించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే వుంటాయని చినజీయర్ పేర్కొన్నారు. 

కాగా.. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు (Sri Ramanuja Millennium celebrations) నిర్వహించిన తీరు కేసీఆర్, చినజీయర్‌ స్వామి మధ్య చిచ్చురేపినట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా వాటికి బలం చేకూర్చేలా ఉన్నాయి. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేకపోవడంతో వివాదం మొదలైందని చెబుతున్నారు. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల రెండో రోజు సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ చిన్న‌జీయ‌ర్ స్వామితో క‌లిసి రామానుజాచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను సీఎం ప‌రిశీలించారు. 

అంతకు కొద్ది రోజులు ముందు కూడా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్.. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలు అధికారులు దిశానిర్దేశం చేశారు. యాగానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని, మిషన్‌ భగీరథ నీళ్లు అందించాలని, యాగం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సీఎం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.  

కట్ చేస్తే..  శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేదని సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయంకు అందింది. ఈ క్రమంలోనే కేసీఆర్.. విగ్రహావిష్కరణకు, మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల వైపు వెళ్లలేదు. 

మరోవైపు శ్రీరామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీపై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించడం కేసీఆర్‌కు మరింత ఆగ్రహం తెప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల వైపు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్‌కు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన కేసీఆర్ ఆయనతో పాటు చినజీయర్ ఆశ్రయమానికి వెళ్లలేదు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ