
కరీంనగర్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్ చిన్నారిని బలితీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం తిమ్మాపూర్ లో రోడ్డుపక్కన నిలబడ్డ శ్రీవాణి అనే 10 సంవత్సరాల వయసు చిన్నారిని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అమాంతం గాల్లోకి ఎగిరి నేలపైపడ్డ చిన్నారి రక్తపుమడుగులో పడిపోయింది. దీంతో కారును అక్కడేవదిలి డ్రైవర్ పరారయ్యాడు.
రోడ్డుపై గాయాలతో పడివున్న చిన్నారిని స్థానికులు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.