ఈ తెలంగాణ బాల రైతుకు ఎంత భూమి ఉందో తెలుసా ?

First Published May 12, 2018, 3:36 PM IST
Highlights

రైతు బంధు చెక్కు అందుకున్న 8 ఏళ్ల పోరడు

రైతులు అనగానే పెద్దవాళ్లు అనుకుంటాం. ఎందుకంటే పొలంలో రైతులు కష్టపడి పనిచేస్తారు. పిల్లలను రైతులు అనరు. ఎందుకంటే వాళ్లు పని చేయడం చట్టరిత్యా నేరం. కానీ తెలంగాణ రైతుబంధు పథకం పుణ్యమా అని 8 ఏళ్ల బాల రైతు రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ వివరాలేంటో చదవండి.

తెలంగాణ రాష్ట్రం లో అతి చిన్న వయసు వున్న రైతు గా చిన్నారి నిలిచాడు. ఈ పోరగాని పేరు కె.నిర్మల్. సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుడతడు. ఈ నిర్మల్ పేరు మీద ఎకరం పావు భూమి ఉంది. (1.25 ఎకరాలు)

భూ యజమాని మాత్రమే వచ్చి చెక్కులు తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే కదా? అందుకే ఈ చిన్నారి రైతుబంధు చెక్కుల పంపిణీ కేంద్రం వద్దకు వచ్చి తన పేరిట వచ్చిన పాసు పుస్తకం, చెక్కులను తీసుకున్నాడు.

ఈ నిర్మల్ ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా నిలిచాడు.

click me!