హైదరాబాద్‌లో విషాదం: రెండ్రోజుల క్రితం వరదలో గల్లంతు.. శవమై తేలిన చిన్నారి

By Siva KodatiFirst Published Oct 18, 2020, 5:24 PM IST
Highlights

హైదరాబాద్ గగన్‌పహాడ్‌లో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం వరదలో కొట్టుకుపోయిన చిన్నారి ఆదివారం శవమై తేలడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

హైదరాబాద్ గగన్‌పహాడ్‌లో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం వరదలో కొట్టుకుపోయిన చిన్నారి ఆదివారం శవమై తేలడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 13వ తేదీన అమీన్‌పూర్  కాజ్‌వేపై వరద నీటి నుండి కారుతో సహా కొట్టుకుపోయిన ఆనంద్ మృతి చెందాడు. ఆదివారం నాడు కాజ్ వే వరద నీటి నుండి కారును వెలికితీశారు.

ఈ నెల 13వ తేదీన అమీన్‌పూర్ కాజ్ వే మీదుగా ఇంటికి వెళ్తున్న ఆనంద్ వరద ఉధృతికి కారుతో పాటు వరదలో కొట్టుకుపోయాడు.ఈ విషయాన్ని ఆయన తన సోదరుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.

అంతేకాదు తాను ఉన్న ప్రాంతాన్ని ఫోన్ ద్వారా లోకేషన్ ను షేర్ చేశాడు. ఈ నెల 14వ తేదీ నుండి ఆనంద్ కోసం జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ ,రెవిన్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అమీన్‌పూర్ ఇసుకబావి మురుగు కాలువలో కారును రెస్క్యూ బృందం ఇవాళ వెలికితీసింది. కారులోనే ఆనంద్ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 16వ తేదీ ఆనంద్ కూతురు పుట్టిన రోజు.

ఆనంద్ భార్య ఐదు నెలల గర్భిణి.ఆనంద్ ఆచూకీ కోసం ఐదు రోజులుగా కాజ్ వే వద్దే వేచి చూస్తున్నారు. ఆనంద్ సజీవంగా కన్పించాలని కుటుంబసభ్యులు, సన్నిహితులు, మిత్రులు కోరుకొన్నారు. కానీ, చివరికి ఆనంద్ శవంగా కన్పించడం వారికి నిరాశను మిగిల్చింది.

click me!