పెళ్లై ఆర్నెళ్లు: భవనంపై నుండి దూకి వివాహిత ఆత్మహత్య

Published : Oct 18, 2020, 04:58 PM IST
పెళ్లై ఆర్నెళ్లు: భవనంపై నుండి దూకి వివాహిత ఆత్మహత్య

సారాంశం

భర్తతో గొడవపడి వివాహిత భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకొంది.ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని చందానగర్ లో జరిగింది.


హైదరాబాద్: భర్తతో గొడవపడి వివాహిత భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకొంది.ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని చందానగర్ లో జరిగింది.కరీంనగర్ కి చెందిన శ్రీవిద్యకు వరంగల్ కి చెందిన శబరీష్ తో ఆరు మాసాల క్రితం వివాహమైంది. శబరీష్ పని కోసం బెంగుళూరుకు వెళ్లాడు.

చందానగర్ లో శబరీష్ బంధువుల ఇంటికి ఆమె వెళ్లింది. శనివారం నాడు ఆమె ఫోన్ లో భర్తతో గొడవపడింది.  ఇదే విషయమై భర్తతో గొడవపడుతూనే ఆమె భవనంపై నుండి దూకింది. భవనంపై నుండి పడిన ఆమె తీవ్రగాయాలతో పడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం నాడు మరణించింది. భర్త శబరీష్  వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని శ్రీవిద్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీవిద్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్