నన్ను, నా తండ్రిని చంపేందుకు కుట్ర .. కోమటిరెడ్డిపై హెచ్‌ఆర్సీకి చెరుకు సుధాకర్ కొడుకు ఫిర్యాదు

Siva Kodati |  
Published : Mar 10, 2023, 06:57 PM ISTUpdated : Mar 10, 2023, 07:01 PM IST
నన్ను, నా తండ్రిని చంపేందుకు కుట్ర .. కోమటిరెడ్డిపై హెచ్‌ఆర్సీకి చెరుకు సుధాకర్ కొడుకు ఫిర్యాదు

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి అనుచరులు తనను, తన తండ్రిని చంపేందుకు తిరుగుతున్నారని ఆయన ఫిర్యాదులో పెరుగుతున్నారు. తనకు రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్సీని ఆయన కోరారు. 

ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌కు కోమటిరెడ్డి బెదిరించినట్లుగా వున్న ఆడియో టేప్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడైన సుధాకర్‌ను, అతని కుమారుడిని చంపుతానంటూ వెంకట్ రెడ్డి బెదిరించినట్లుగా అందులో వుంది. సుహాస్‌కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు వెంకట్ రెడ్డి. ప్రజల్లో తిరిగినా, తనపై స్టేట్‌మెంట్ ఇచ్చినా సుధాకర్‌ను చంపుతామని, హాస్పటల్‌ను సైతం ధ్వంసం చేస్తానని ఆయన హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోనని చంపేస్తానని కోమటిరెడ్డి సదరు ఫోన్ కాల్‌లో సుహాస్‌ను హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని.. వారిని తాను ఆపలేనని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

Also REad: చెరుకు సుధాకర్‌కు బెదిరింపులు: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు

అయితే ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప దీని వెనకాల వేరే ఉద్దేశం లేదని తెలిపారు. నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటీ నుంచి తనను తిడుతున్నాడని అన్నారు. చెప్పలేని మాటలు అంటున్నాడని తెలిపారు. మూడు  నెలలుగా సోషల్ మీడియా వేదికగా ఒకటే దూషణలు చేస్తున్నారని అన్నారు. దరిద్రుడని, చీడపురుగు అని తిడుతున్నారని.. దాని గురించి అడగడానికే ఫోన్ చేశానని చెప్పారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించలేదని తెలిపారు. శత్రువులు, ప్రత్యర్థులను కూడా దగ్గరికి తీసే మనస్తత్వం తనదని వెంకట్ రెడ్డి చెప్పారు. 

మరోవైపు.. ఆ మరుసటి రోజే  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు. బెదిరింపులపై  చెరుకు సుధాకర్  , ఆయన  కొడుకు  సుహాస్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు  ఆదారంగా  పోలీసులు వెంకట్ రెడ్డిపై  ఐపీసీ  506 సెక్షన్ కింద  కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్