ముగిసిన ముత్యం రెడ్డి అంత్యక్రియలు

Siva Kodati |  
Published : Sep 04, 2019, 04:11 PM ISTUpdated : Sep 04, 2019, 05:05 PM IST
ముగిసిన ముత్యం రెడ్డి అంత్యక్రియలు

సారాంశం

అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ముత్యంరెడ్డి స్వగృహం నుంచి తొగుట మండలం తిక్కాపూర్‌ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం వరకు ఆయన అంతిమ యాత్ర జరిగింది.

అనంతరం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ముత్యంరెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించగా.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముత్యం రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. 

మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూత

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్