టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

By Arun Kumar PFirst Published Sep 12, 2018, 9:09 PM IST
Highlights

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. తమ నాయకుడిని కాదని ఎంపి బాల్క సుమన్ కు టికెట్ కేటాయంచడంపై నల్లాల ఓదేలు అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. తమ నాయకుడికే టికెట్ కేటాయించాలను నిరసనలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఏకంగా బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఐదుగురు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఈ నియోజకవర్గంలో అలజడి రేగింది. 

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రంగం సిద్దం చేశారు. అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ లు అందరికీ మళ్లీ అవకాశం కల్పించిన కేసీఆర్ ఓ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వకుండా నిరాకరించారు. ఇలా నిరాకరణకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నల్లాల ఓదేలు ఒకరు. కేసీఆర్ నిర్ణయంతో ఓదేలుతో పాటు అతడి అనుచరులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 

ఈ క్రమంలో చెన్నూరు నియోజకవర్గం నుండి సీటు  పొందిన బాల్క సుమన్ ప్రచారానికి సిద్దమయ్యాడు. అయితే అతడి పర్యటనను వ్యతిరేకిస్తూ ఇందారం గ్రామంలో 5 గురు కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!